Ahimsa: దగ్గుబాటి ఫేమ్‌ నాకొద్దు.. దర్శకుడు తేజ నాకు దేవుడు: దగ్గుబాటి అభిరామ్‌

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram) హీరోగా నటించిన సినిమా ‘అహింస’ (Ahimsa). జూన్2న ఈ సినిమా విడుదల కానుంది.

Published : 30 May 2023 16:13 IST

హైదరాబాద్‌: దగ్గుబాటి అభిరామ్‌ (Daggubati Abhiram) హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా ‘అహింస’ (Ahimsa). ఈ చిత్రంతో రానా (Rana) తమ్ముడు అభిరామ్‌ హీరోగా పరిచయం కానున్నాడు. సదా (Sada) కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో గీతిక తివారీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  విడుదల తేదీ దగ్గరవ్వడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా అభిరామ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దర్శకుడు తేజ (Teja) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘‘నాకు పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కే కథలంటే ఇష్టం. అలాంటి కథల కోసమే ఇన్నిరోజులు ఎదురుచూశాను. ‘అహింస’ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నా మొదటి సినిమాకు తేజగారు దర్శకత్వం వహించడం నా అదృష్టం. ఆయన దగ్గర పనిచేస్తే మన టాలెంట్‌ పెరుగుతుంది. నేను ఇప్పుడే కెరీర్‌ ప్రారంభించాను. ఆయన దగ్గర సక్సెస్‌ అయితే ఎక్కడైనా రాణించవచ్చు. నన్ను జీరో నుంచి పై లెవల్‌కు తీసుకెళ్లారు. నేను పెద్ద హీరో అవ్వాలని.. నా కంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని.. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఆయన నిజంగా దేవుడు. నాకు ఎన్నో విషయాలు నేర్పించారు’’ అని చెప్పాడు.

ఇక ఇంటి పేరును బట్టి కాదని తన నటన ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని అభిరామ్‌ ప్రేక్షకులను కోరాడు. ‘‘టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ సురేశ్‌ బాబు కుమారుడిగానో.. లేదంటే రానా తమ్ముడిగానో నన్ను గుర్తించవద్దు. ‘అహింస’లో నా నటన చూసి నన్ను ఆదరించండి. మనకు ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ అన్ని విషయాల్లో పనికిరాదు. ఈ సినిమా చూశాక ఇంట్లో వాళ్లంతా మెచ్చుకున్నారు. వెంకటేశ్‌ గారు కొన్ని సలహాలు ఇచ్చారు. నటన పరంగా నాకు కొన్ని సూచనలు చేశారు. తర్వాత సినిమాల్లో వాటిని కచ్చితంగా అమలు చేస్తాను’’ అని అభిరామ్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని