Chiranjeevi: చిరు 157 షురూ.. వశిష్ఠ ట్వీట్‌..!

చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా వర్క్స్‌ మొదలయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు వశిష్ఠ అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 10 Sep 2023 16:22 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).. ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్‌ వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను వశిష్ఠ నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘మెగా చిత్రానికి మెగా ఆరంభం. ప్రీ ప్రొడెక్షన్‌ వర్క్‌తో #MEGA157 మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సినిమాటిక్‌ అడ్వెంచర్‌లోకి తీసుకువెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన తెలిపారు. ఈ మేరకు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు, యూవీ నిర్మాతలు తాజాగా చిరంజీవిని కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని వశిష్ఠ షేర్‌ చేశారు.

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రశంసలు.. వీడియో వైరల్‌

‘భోళాశంకర్‌’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రమిదే. సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్స్‌గా కనిపించే అవకాశం ఉందని సమాచారం. చిరు పుట్టినరోజును పురస్కరించుకుని గత నెలలో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది నిర్మితం కానుంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌ పోస్టర్‌ అభిమానులను దృష్టిని ఆకర్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని