Family Star: రియల్‌ ఫ్యామిలీస్టార్‌ను కలిసిన విజయ్‌ దేవరకొండ టీమ్‌.. వీడియో వైరల్‌

విజయ్ దేవరకొండ, దిల్‌రాజు కలిసి ఓ అభిమానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వాళ్ల ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు.

Published : 09 Apr 2024 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దిల్‌ రాజుతో ఓ అభిమాని మాట్లాడుతూ.. తన కుటుంబంలో అతడి చెల్లి రియల్‌ ఫ్యామిలీ స్టార్‌ అని.. దివ్యాంగురాలైనా ఉద్యోగం చేస్తూ అందరినీ చూసుకుంటోందన్నాడు. ఈ విషయం విన్న దిల్‌ రాజు భావోద్వేగానికి గురయ్యారు. తప్పకుండా ఆమెను కలుస్తానన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ అభిమాని ఇంటికి ఫ్యామిలీ స్టార్‌ చిత్రబృందమంతా వెళ్లి సర్‌ప్రైజ్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ, దిల్‌రాజు, పరశురామ్‌ ఆమెతో కాసేపు ముచ్చటించారు.  స్టార్‌ హీరో తన ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

భారీ అంచనాల మధ్య ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తాము అనుకున్న విజయాన్ని సాధించిందని తాజాగా నిర్మాత తెలిపారు. లాజిక్‌లు చూడొద్దన్నారు. ‘‘దర్శకుడు రాసుకున్న కథ, పాత్రను బట్టి నటీనటుల ఎంపిక ఉంటుంది. వెన్నెల కిషోర్‌ను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాం. ఆయన కనిపించిన సీన్స్‌కు విపరీతంగా నవ్వుతున్నారు. పెళ్లి సాంగ్‌ మంచి హిట్‌. అయితే, సినిమా ఫ్లో ఆగిపోతోందనే కారణంతోనే ఆ పాటను చివర్లో పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమాను సినిమాటిక్‌గానే తీయాలి. లేకపోతే డాక్యుమెంటరీలా ఉంటుంది’’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని