‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్‌ బ్యాంగ్స్‌ అదిరిపోతాయి: రామ్-లక్ష్మణ్

ram lakshman: చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన రామ్‌-లక్ష్మణ్‌ పంచుకున్న విశేషాలివే!

Published : 31 Dec 2022 23:10 IST

‘వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి’ చిత్రాల్లో ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌లు అదిరిపోతాయని యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ అన్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు చిత్రాల్లోని పలు యాక్షన్‌ సన్నివేశాలకు వీరే దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా చిరు, బాలకృష్ణ చిత్రాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఒక ఐడియా దర్శకుడికి నచ్చుతుంది!

‘‘యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎలా చేయాలన్న ఆలోచన ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మా అదృష్టం ఏమిటంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి రెండు ఆప్షన్స్‌ని డైరెక్టర్ దగ్గరికి తీసుకెళతాం. అందులో ఒకటి కచ్చితంగా నచ్చుతుంది. మేము ఇలానే ప్లాన్ చేసుకుంటాం. ప్రతి ఫైట్‌కు కాన్సెప్ట్‌ ఉంటే అది మరింత ప్రేక్షకులను అలరిస్తుంది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనాన్ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్‌గా ఫైట్‌ని కంపోజ్ చేయడం వల్లే థియేటర్‌లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. వీరసింహారెడ్డిలో బాలయ్యబాబు కుర్చీలో కూర్చుని ఉంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. ఆయన క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చుని కొట్టాలా? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు కూర్చీలో కూర్చొనే ఫైట్‌ చేసేలా కంపోజ్‌ చేశాం. అలాగే ఇంటర్వెల్ ఫైట్ టర్కీలో చేశాం. అక్కడ భారీగా ఖర్చయ్యింది. ఫైట్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది’’

చిరు స్టైలిష్‌గా కనిపిస్తారు!

‘‘వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే వీరయ్య.. ఇంటర్వెల్‌లో సడన్‌గా రెండు గన్స్ పట్టుకొని స్టైలిష్‌గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. ఈ సీక్వెన్స్‌ చేయడానికి 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు.  అలాగే చిరు- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

ఇద్దరివి భిన్నమైన క్యారెక్టరైజేషన్స్‌

‘‘వాల్తేరు వీరయ్య, ‘వీరసింహారెడ్డి’ రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్‌గా ఉండటం వల్ల క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేశాం. బాలకృష్ణ వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో అన్నయ్య, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని