Fighter: ‘ఫైటర్‌’లో ముద్దు సన్నివేశం.. లీగల్‌ నోటీసులు పంపిన ఆఫీసర్‌

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫైటర్‌’(Fighter)లోని సన్నివేశంపై వాయుసేన అధికారి అభ్యంతరం వ్యక్తంచేశారు.

Published : 06 Feb 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ యాక్షన్‌ చిత్రం తాజాగా చిక్కుల్లో పడింది. ఇందులోని ఓ సన్నివేశంపై ఎయిర్‌ఫోర్స్‌ అధికారి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపారు. అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్‌.. ఇందులోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సన్నివేశంలో హీరో, హీరోయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ యూనిఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. యూనిఫాంలో అలాంటి సీన్స్‌ చేయడమంటే.. దాన్ని అవమానించినట్లేనని ఆరోపించారు. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

 ‘ఈగల్‌’ టీమ్‌ డేరింగ్‌ స్టెప్‌.. అందుబాటు ధరలో మూవీ టికెట్స్‌.. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ తెరకెక్కింది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇందులో హృతిక్, దీపికలు యుద్ధ విమాన పైలట్లుగా కనిపించారు. ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తంచేసిన హృతిక్ రోషన్‌ దీనికోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ‘ఇందులో నా లుక్‌ కోసం కఠోరంగా శ్రమించా. సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా. ఏడాదిపాటు స్నేహితులను కూడా కలవలేదు. త్వరగా నిద్రపోయేవాడిని. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవాడిని’ అని చెప్పారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని