చిరు నోట ఆ మూడు పాటలు.. ఎందుకని?
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక చూసినవారికి బాగా గుర్తుండిపోయే అంశాల్లో చిరంజీవి - విజయశాంతి ముచ్చట్లు ఒకటి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి చిరంజీవి....
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక చూసినవారికి బాగా గుర్తుండిపోయే అంశాల్లో చిరంజీవి - విజయశాంతి ముచ్చట్లు ఒకటి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి చిరంజీవి గొప్పగా చెప్పుకొచ్చారు. అలా అని విజయశాంతి కూడా ఏం తక్కువ చేయలేదు. మీరు నా హీరో అంటూ పొగిడేశారు. ఈ క్రమంలో చిరంజీవి నోట ఓ మూడు పాటలు వచ్చాయి. అవి వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ సాంగ్స్. అసలు అవేంటి.. ఎందుకు స్పెషలో చూద్దాం!
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిది ఓ అధ్యాయం. తనదైన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌తో అభిమానులను కట్టిపడేశారాయన. అప్పటి తరం నుంచి నేటి తరం వరకు ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. ఆయన సినిమా వస్తుందంటే ఇప్పటికీ థియేటర్లు కిక్కిరిసిపోవాల్సిందే. బాక్సాఫీసు బద్ధలవ్వాల్సిందే. ఈ క్రమంలో ఆయన హిట్ పాటలు గురించి చెప్పుకుంటే విజయశాంతితో ఆడిపాడినవి ఎక్కువున్నాయి. వీరిద్దరూ కలిసి దాదాపు 20 చిత్రాల్లో నటించారు. వాటిలో మూడింటిని చిరంజీవి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. అవే ‘గ్యాంగ్ లీడర్’లోని ‘వాన వాన వెల్లువాయే’, ‘సండే అనను రా.. మండే అననురా..’. ‘ఛాలెంజ్’లోని ‘ఇందువదన కుందరదన...’.
వానపాటల్లో వావ్...
చిరంజీవి సినిమాల్లో ‘గ్యాంగ్‌లీడర్’ స్థానం ప్రత్యేకమైనది. మాస్‌లో ఆయన ఇమేజ్‌ను పెంచడంలో సినిమా పాత్ర కీలకం. అందులో ఫైట్లు ఎంత హిట్టో. పాటలూ అంతే హిట్. బప్పిలహరి సంగీతం సమకూర్చిన ఆ సినిమా పాటలూ ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. అందులో చిరు- విజయశాంతి స్టెప్పులు ఇప్పటికీ హైలైటే. తెలుగులోని ఆల్ టైమ్ హిట్ రొమాంటిక్ సాంగ్స్‌లో ఒకటి ‘వాన వాన వెల్లువాయే...’. ఈ పాటలో చిరు తెలుపు చొక్కాతో, విజయశాంతి ఎరుపు రంగు చీరలో వానలో చేసే నృత్యాలు ఆ రోజుల్లో యువతకు రొమాంటిక్ కిక్‌ని ఇచ్చాయి. ఇందులో ఇద్దరూ చూపించిన గ్రేస్ లెక్కే వేరు. ఆ సినిమా పాట ఏ రేంజిలో హిట్ అయ్యిందో... ఆ తర్వాత రామ్‌చరణ్ ‘రచ్చ’లో వచ్చిన రీమేక్ కూడా అంతే ఆకట్టుకుంది.
గిల్లికజ్జాల పాట...
చిరంజీవి పాటలు అంటే భారీ స్టెప్పులే వేయక్కర్లేదు. ఈ సంగతి అంతకుముందే చాలా సినిమాల్లో రుజువైనా.. ‘గ్యాంగ్ లీడర్’లో మరోపాటతో మరోసారి తేలింది. సినిమాలో ఇద్దరి గిల్లికజ్జాల సీన్ తర్వాత వచ్చే ‘సండే అనను రా.. మండే అననురా..’. పాటలో గ్రేస్ స్టెప్పులే కనిపిస్తాయి. అయితేనేం పాట మొత్తం ఫన్నీగా సాగుతుంది. చిరు-విజయశాంతి తనదైన శైలిలో పాటలో గిల్లికజ్జాలు ఆడుతూ ఎంజాయ్ చేసేలా పాటను తీర్చిదిద్దారు. అంత స్లో మూమెంట్స్ ఉన్నా... పాట బీట్‌లో ఉన్న పాటను ఇప్పటికీ గుర్తుకుపెట్టుకునేలా చేసింది. చిన్న చిన్న స్టెప్పులతో స్టైల్‌గా చిరు - విజయశాంతి రప్ఫాడించారు.
‘ఛాలెంజ్’ చేసి మరీ...
‘ఐదు సంవత్సరాల్లో రూ.50 లక్షలు’... ఈ లెక్క చెప్పగానే ఇది ‘ఛాలెంజ్’ సినిమా గురించి అని అర్థమైపోతుంది. ఈ సినిమా గురించి గుర్తు చేయాలంటే మరో స్టైల్ కూడా ఉంది. అదే ‘ఇందువదన కుందరదన...’. ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇళయరాజా కంపోజిషన్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి ఆలపించిన పాట ఇది. పాట ఎంత బాగుంటుందో దాని పిక్చరైజేషన్ అంతే బాగుంటుంది. సముద్రం ఒడ్డున, పోర్టులో, అందమైన ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ గీతం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక చిరు - విజయశాంతి స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?. ‘ఐలవ్యూ.. ఓ హారిక.. నీ ప్రేమకే జోహారిక’ అంటూ కుర్రకారు ఆ రోజుల్లో ఈ పాటను తెగ పాడేసుకున్నారు. మీరూ పాడే ఉంటారనుకుంటున్నాం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్