రజనీకాంత్‌కు  దాదాసాహెబ్‌ ఫాల్కే

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Updated : 01 Apr 2021 11:46 IST

దిల్లీ: అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విశిష్ట గౌరవం దక్కింది. కేంద్రం గురువారం ఉదయం ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. 

ఇటీవల కాలంలో బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ఈ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అలాగే దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి(తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు(తెలుగు), శివాజీ గణేషన్‌(తమిళం), రాజ్‌కుమార్‌(కన్నడ), గోపాలకృష్ణన్‌(మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌(తెలుగు, తమిళం), కె. విశ్వనాథ్‌(తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని