సిక్స్ కొట్టిన ‘డ్యూన్’
ఇదేంటి... ఐపీఎల్ శీర్షిక సినిమా పేజీలో అనుకుంటున్నారా? కాదండీ బాబు. కాస్త ఓపికగా చదవండి... ‘డ్యూన్’, ‘డ్యూన్’, ‘డ్యూన్’.. ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్కువగా వినబడిన చిత్రం పేరిది. ఒకటి కాదు రెండు కాదు.. 10 విభాగాల్లో నామినేట్
ఇదేంటి... ఐపీఎల్ శీర్షిక సినిమా పేజీలో అనుకుంటున్నారా? కాదండీ బాబు. కాస్త ఓపికగా చదవండి... ‘డ్యూన్’, ‘డ్యూన్’, ‘డ్యూన్’.. ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఎక్కువగా వినబడిన చిత్రం పేరిది. ఒకటి కాదు రెండు కాదు.. 10 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఆరు అవార్డులు సొంతం చేసుకుని ఈ ఏడాది ఆస్కార్ వేదికపై విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ చిత్రంగా ఈ ఏడాది ఆస్కార్ గెలుపొందిన ‘కొడా’ని పక్కకి నెట్టి.. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్ ఇలా ఆరు విభాగాల్లో తన సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ‘డ్యూన్’ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం..!
ఫిక్షనల్ కథలతో ఎంతోమంది పాఠకుల హృదయాలు గెలుచుకున్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్. ఆయన రచించిన ఎన్నో కథలు విశేషమైన గుర్తింపు సొంతం చేసుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా ‘డ్యూన్’. 1965లో ప్రచురితమైన ఈ నవలకు పాఠకులు ఎంతగానో ఆకర్షితులయ్యారు. రెండు సంపుటాలుగా విడుదలైన ఈ నవలను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు డెన్ని విల్లెవ్ తెరకెక్కించిన చిత్రమే ‘డ్యూన్’. తిమోతీ చలమెట్, రెబెక్కా ఫెర్గూసన్, ఆస్కార్ ఐజాక్, జోష్ బ్రోలిన్ వంటి హాలీవుడ్ తారలు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. 10,191 సంవత్సరంలో ఈ కథ జరుగుతున్నట్లు మనకు చెబుతారు. విశ్వంలోని రెండు వేర్వేరు గ్రహాల మధ్య సాగే కథ ఇది. దీంట్లో పాల్ అట్రీడెస్ (తిమోతీ చలమెట్) అనే ఓ తెలివైన కుర్రాడు ఉంటాడు. అతను పుట్టుకతోనే అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన వ్యక్తి. ఓ ప్రమాదకర గ్రహంలోని ఇసుకలో ఉన్న లోహాన్ని చేజిక్కించుకుంటే.. విశ్వంలోని అన్ని గ్రహాలు తమ సొంతమవుతాయనే విశ్వాసం అందరిలో ఉంటుంది. పాల్ తన కుటుంబంతో పాటు సమస్త మానవాళి మనుగడ కోసం విశ్వంలోని అత్యంత ప్రమాదకరమైన ఆ ఎడారి గ్రహానికి ప్రయాణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? ఆ గ్రహంలోని దుష్టశక్తులతో అతనెలా పోరాటం చేశాడు? అన్న ఆసక్తికరమైన అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది అక్టోబరు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన ‘డ్యూన్’ కథకు న్యాయం చేసేలా ఈ సినిమా ఉందని అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. 16.5 కోట్ల యూఎస్ డాలర్లతో రూపుదిద్దుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 40.05 కోట్ల యూఎస్ డాలర్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
పది విభాగాల్లో గట్టి పోటీనిచ్చి
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నటీనటులతోపాటు గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేస్తారనే సంగతి తెలిసిందే. విజువల్స్, గ్రాఫిక్స్ చక్కగా కుదిరితే సినిమా కొంతవరకూ విజయం సాధించినట్టే. అదే సూత్రాన్ని ఫాలో అయ్యాడు దర్శకుడు డెన్ని విల్లెవ్. పేరుపొందిన నటీనటులతో పాటు మాంచి టెక్నికల్ టీమ్‌ని తన బృందంలోకి తీసుకుని ‘డ్యూన్’ని తెరకెక్కించారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులు, చూపుతిప్పుకోనివ్వని పోరాట ఘట్టాలతో సాగుతుందీ చిత్రం. విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఈ ఏడాది 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌లో నిలబడింది. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రానికి అన్నింటా గట్టి పోటీ ఇచ్చింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ అవార్డులు అందుకోగా.. ఉత్తమ చిత్రం, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, హెయిర్ స్టైలిస్ట్.. ఈ విభాగాల్లో అవార్డులను చేజార్చుకుంది.
వచ్చే ఏడాది మరో భాగం
‘డ్యూన్’ నవలలోని రెండో భాగాన్ని ఆధారంగా చేసుకుని ‘డ్యూన్-2’ రూపొందించడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఇప్పటికే చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే?