Lokesh Kanagaraj: ఆ సీన్స్‌ తొలగింపు.. బాధపడ్డా: లోకేశ్‌ కనగరాజ్‌

‘లియో’ (LEO) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ఇందులో భాగంగా ఆయన సినిమాలో అభ్యంతరకర పదాలు వాడటంపై స్పందించారు. 

Updated : 09 Oct 2023 20:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విడుదలకు ముందే ‘లియో’ (Leo) పలు కాంట్రవర్సీలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సంభాషణలు ఉండటంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లో వాటిని ఎందుకు మ్యూట్‌ చేయలేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై  తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు. పలు సన్నివేశాల్లో భావోద్వేగం పండటం కోసమే తాను అలాంటి పదాలను వాడానని చెప్పారు.

Alia Bhatt: అలా ప్రవర్తించడం షారుక్‌ నుంచే నేర్చుకున్నా: అలియా భట్‌

‘‘సినిమాలోని కీలక సన్నివేశాల్లో విజయ్‌.. తనలోని బాధను తెలియజేయడం కోసం కొన్ని అభ్యంతరకర పదాలు మాట్లాడతారు. ఆయా సన్నివేశాల్లో ఆ పదాలు ఉపయోగించకపోతే ఎమోషన్‌ పండదు. ఆ సంభాషణల పట్ల విజయ్‌ మొదట అనాసక్తి కనబరిచారు. అలాంటి పదాలు లేకుండా డైలాగ్‌ చెబుతా అన్నారు. కాకపోతే నేనే నచ్చజెప్పి ఒప్పించా. కాబట్టి ఆ బాధ్యత నేనే తీసుకుంటా. 18 ఏళ్లు నిండినవాళ్లు కూడా చూడలేని సీన్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి వాటిని తొలగించమని సెన్సార్‌ సూచించింది. అలా, కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను కట్‌ చేశాం. ఆ విషయంలో నేను కాస్త నిరాశకు గురయ్యా’’ అని తెలిపారు. యాక్షన్‌ డ్రామాతో సిద్ధమైన ఈ చిత్రం అక్టోబర్‌19న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని