SaiPallavi: రామ్‌చరణ్‌కు జంటగా సాయిపల్లవి.. అభిమానులు ఫుల్ ఖుష్‌..!

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటిగా సాయిపల్లవి ఎంపికైనట్లు తెలుస్తోంది.

Published : 16 Nov 2023 18:57 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ (RamCharan) హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆర్‌సీ 16గా ఇది ప్రచారం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన ఎవరు నటించనున్నారనే దానిపై రవీనాటాండన్ కుమార్తె రాషా థడానీ (Rasha Thadani), కీర్తిసురేశ్‌ (Keerthy suresh) అంటూ ఇప్పటికే ఎన్నో పేర్లు వినిపించాయి. ఇప్పుడీ జాబితాలోకి నటి సాయిపల్లవి పేరు వచ్చి చేరింది. రామ్‌చరణ్‌ సరసన ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చిత్రబృందం సైతం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రతినాయకుడిగా విజయ్‌ సేతుపతిని ఫిక్స్ చేశారని టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

Kareena Kapoor: యశ్‌తో నటించాలని ఉంది: కరీనా కపూర్‌

‘ఉప్పెన’ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించనున్న సినిమా ఇది. స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈసినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్‌ ఈ సినిమా మొదలుపెట్టనున్నారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఇంకా వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని