Kamal Haasan: వాటి వల్లే నేను ఈస్థాయికి చేరుకున్నా: కమల్‌ హాసన్‌

భారీ వసూళ్లు సాధించే సినిమాల కన్నా మంచి చిత్రాల గురించే ప్రేక్షకులు ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారని కమల్‌ హాసన్‌ (Kamal Haasan)అన్నారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావాలని ఆయన కోరుకున్నారు.

Updated : 25 Dec 2023 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘రూ.500 కోట్లు, రూ.600 కోట్లు సాధించే సినిమాల కన్నా... ప్రేక్షకులు మంచి చిత్రం గురించి ఎక్కువ రోజులు మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకోవాలి. అన్ని రకాల సినిమాలు విడుదలై అలరించాలి’’ అని అన్నారు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌. ఇండస్ట్రీలోని మల్టీ టాలెంటెడ్‌ నటుల్లో ఆయన ఒకరు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే టీవీ రియాలిటీ షో కూడా చేస్తున్నారు. తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ షోకు కమల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో తాజా ఎపిసోడ్‌లో సినిమాల వసూళ్లు విషయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మనం హోటల్‌లో ఆర్డరు ఇచ్చే మెనూలోనే అన్ని రకాలూ ఉండేలా చూసుకుంటాం. మరి వినోదం విషయంలో అలా ఎందుకు ఆలోచించం. ఒకే తరహా చిత్రాలు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు?. నేను ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యమిస్తాను. ఎందుకంటే నేను చిత్రపరిశ్రమకు పెద్ద అభిమానిని. కేవలం స్పెషల్‌ ఎఫెక్ట్‌లు, గ్రాఫిక్స్‌లు ఎక్కువగా ఉన్న సినిమాలే ఇండస్ట్రీని నిలబెట్టవు. చిన్న బడ్జెట్‌ చిత్రాలు లేకుండా పరిశ్రమ మనుగడ సాధించలేదు. కొత్త దర్శకులు, కొత్తగా ఆలోచించే వాళ్లు ఇండస్ట్రీలోకి రావాలి. సినీ పరిశ్రమ ఎప్పుడూ సూపర్‌ స్టార్లు, అగ్ర దర్శకుల మీదనే ఆధారపడి ఉండదు’’ అని అన్నారు కమల్‌. ఇలా చెబుతున్నానంటే ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదు అని చెప్పిన కమల్‌... చిన్న బడ్జెట్‌ చిత్రాల కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను అని గుర్తు చేశారు. 

తొలిసారి కుమార్తెను చూపించిన అలియా - రణ్‌బీర్‌.. వీడియో వైరల్‌

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కమల్‌ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో కీలక పాత్రలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) అనే భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నారు వీటితోపాటు వినోద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం కమల్‌ లైనప్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని