Tiger 3: టవల్ ఫైట్‌ కోసం కత్రినా ఇంత కష్టపడిందా.. వీడియో షేర్..

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)- కత్రినా కైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టైగర్‌3’ (Tiger 3). ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం కత్రినా శిక్షణ తీసుకుంటున్న వీడియోను ఆమె షేర్‌ చేశారు.

Published : 06 Nov 2023 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ‘టైగర్3’. అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, క్రేజీ కథానాయిక కత్రినా కైఫ్‌ (Katrina Kaif)జంటగా నటిస్తున్నారు. దీని ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ఇందులోని టవల్ ఫైట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైట్ కోసం కత్రినా ఎంత కష్టపడిందో తెలుపుతూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను షురూ చేసింది. ఇందులో భాగంగా కత్రినా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘టైగర్‌3’లోని యాక్షన్ సన్నివేశాల కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ‘సినిమా కోసం మనం పడే ప్రతి కష్టం మరో సంచలనానికి దారితీస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. కానీ, వాటన్నింటి కంటే ‘టైగర్‌3’ ప్రత్యేకమైనది. ఇందులో నా పాత్రను సవాల్‌గా తీసుకున్నా. ప్రతి సన్నివేశం బాగా రావాలని వంద శాతం ప్రయత్నించా. శిక్షణ తీసుకుని ప్రాక్టీస్ చేశాను. నిబద్ధతతో చేసిన పనులు విజయాన్ని సొంతం చేస్తాయని నాకు నమ్మకం ఉంది’ అని రాసుకొచ్చింది.

నాకెంతో బాధగా ఉంది: మార్ఫింగ్‌ వీడియోపై రష్మిక పోస్ట్‌

ఇక ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా రానున్న ‘టైగర్‌3’ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదో సినిమాగా ఆదిత్య చోప్రా నిర్మిసున్నారు. ఇందులో షారుక్‌ ఖాన్‌, హృతిక్ రోషన్‌ కీలక పాత్రలో నటించారు. వీళ్ల ముగ్గురి మధ్య భారీ పోరాట ఘట్టాల్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.  ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని