Keerthy Suresh: కీర్తి సురేశ్‌ అభిమాని.. రిప్లై కోసం 234 రోజుల నిరీక్షణ

తన అభిమాని పోస్ట్‌పై ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ స్పందించారు. ఈ రిప్లై కోసం ఆ అభిమాని కొన్ని నెలలుగా ఎదురుచూశారు.

Updated : 24 Jan 2024 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఒక్కసారైనా అభిమాన నటులను కలుసుకోవాలని చాలామంది ఆశగా ఎదురుచూస్తుంటారు. వారి ఆటోగ్రాఫ్‌ కోసం ఆరాటపడేవారు, సెల్ఫీ కోసం పోటీ పడేవారూ ఉంటారు. ‘నా ఫేవరెట్‌ యాక్టర్‌ని చూసినా చాలు’ అని అనుకునేవారు కొందరైతే.. సోషల్‌ మీడియా వేదికగా పలకరించినా ఫర్వాలేదని ఇంకొందరు ఫీలవుతుంటారు. అలా.. ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అభిమాని ఒకరు ఆమె సమాధానం కోసం కొన్ని నెలలుగా నిరీక్షించారు. చివరకు 234వ రోజు తాను ఎంతగానో అభిమానించే తార నుంచి రిప్లై పొందారు.

నేను డేటింగ్‌లో ఉన్నా.. కానీ అతడితో కాదు: కంగన

‘కీర్తి సురేశ్‌ రిప్లై ఇచ్చేంతవరకు ఇలా ట్వీట్‌ చేస్తూనే ఉంటా’ అంటూ కృష్ణ (సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ ఖాతాలో ఉన్న పేరు) అనే అభిమాని ఆ నటి ఫొటోలను షేర్‌ చేయడం ప్రారంభించారు. డే 1, డే 2, డే 3.. ఇలా రోజులు లెక్కపెడుతూ వచ్చారు. అలా.. 234వ రోజు పెట్టిన పోస్ట్‌ చూసిన కీర్తి.. ‘‘హో.. 234! ఫ్యాన్సీ నంబరు. మీరు ఇంతకాలం వెయిట్‌ చేసినందుకు సారీ. లవ్‌ యూ’’ అని పేర్కొన్నారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించానంటూ సదరు అభిమాని మరో పోస్ట్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఇతర అభిమానులు ఆయనకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. కీర్తి ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. గతేడాది.. ‘దసరా’, ‘మామన్నన్‌’, ‘భోళా శంకర్‌’తో అలరించిన ఆమె ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సైరెన్‌’ (Siren), ‘రఘు తాత’ (Raghuthatha) విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘రివాల్వర్‌ రీటా’ (Revolver Rita), ‘కన్నివేడి’ (Kannivedi) చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని