krithi shetty: ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశా: కృతి శెట్టి

‘కస్టడీ’ కోసం 15 రోజుల పాటు వాటర్‌ సీక్వెన్స్‌ చేశామని, అందుకు శిక్షణ కూడా తీసుకున్నట్లు కథానాయిక కృతిశెట్టి (krithi shetty) చెప్పారు.

Published : 06 May 2023 22:49 IST

‘కస్టడీ’ కోసం 15 రోజుల పాటు వాటర్‌ సీక్వెన్స్‌ చేశామని, అందుకు శిక్షణ కూడా తీసుకున్నట్లు కథానాయిక కృతిశెట్టి (krithi shetty)తెలిపారు. నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కృతిశెట్టి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘కస్టడీ’ కథలో ఆసక్తికర అంశం ఏమిటి ? మీ పాత్రలో ఏం నచ్చింది?

కృతిశెట్టి: దాదాపు సినిమాల్లో హీరో, విలన్‌ని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కస్టడీ లో మాత్రం హీరో విలన్‌ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర  దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. నటనకు ఆస్కారం ఉండే పాత్ర. నిడివి కూడా ఎక్కువే.  సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, కస్టడీ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత మార్వెల్స్ స్టూడియో నుంచి నాకు కాల్ వస్తుందని వెంకట్ ప్రభుగారితో చెప్పాను (నవ్వుతూ). నా పాత్రలో మంచి ఎమోషన్ ఉంటుంది.

అండర్ వాటర్ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంటుందని విన్నాం ?

కృతిశెట్టి: అవును, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. దాదాపు 15 రోజులు ఆ సీక్వెన్స్ చేశాం. ఒక ఐదు రోజుల పాటు కంటిన్యూగా  నీళ్లలో ఉన్నాం. దాని కోసం రెండు రోజులు శిక్షణ తీసుకున్నాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిమిషాలు పాటు ఉంటేనే ఒక షాట్ సాధ్యపడుతుంది. ఒక దశలో నాకు భయం వేసింది.

నాగ చైతన్య తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

కృతిశెట్టి: నాగ చైతన్య నిజాయితీగా ఉంటారు. నేను ఆఫ్ స్క్రీన్ చై తో కంఫర్ట్ బుల్ గాఉంటా. అదే ఆన్‌ స్క్రీన్‌లోనూ వర్కవుటైంది. కస్టడీ సెట్స్‌లో నేను రౌడీలా ఉన్నానని వెంకట్ ప్రభు అన్నారు. వ్యక్తిగతం నేనూ అదే టైపు.(నవ్వుతూ)

ఇటీవల మీరు నటించిన కొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి కదా! ఎలా తీసుకుంటారు?

కృతిశెట్టి: ఎవరికీ సక్సెస్ రెసెపీ తెలీదు. (నవ్వుతూ) మన ప్రయత్నం మనం చేస్తాం. జయాపజయాలు ప్రయాణంలో భాగమే. అయితే అపజయం వచ్చినపుడు దాని విశ్లేషించుకొని మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను.

బాలీవుడ్ వైపు ఆలోచనలు ఉన్నాయా ?

కృతిశెట్టి: ప్రతి భాషలో సినిమా చేయాలన్నది నా ఆలోచన. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా. అలాగే ఎప్పటికైనా దర్శకత్వం చేయాలని ఉంది. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి.  ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఓ మలయాళం సినిమా చేస్తున్నాను. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని