Alitho Saradaga: చైనా.. అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ ట్రిప్‌

‘ప్రేమికులు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ముంబయి చిన్నది కామ్నా జఠ్మలానీ. మొదటి సినిమాతో అనుకున్నంతస్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన కామ్నా మూడో సినిమా ‘రణం’తో సూపర్‌హిట్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు...

Updated : 30 Jun 2021 17:32 IST

భావోద్వేగానికి గురైన కామ్నా

హైదరాబాద్‌: ‘ప్రేమికులు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ముంబయి చిన్నది కామ్నా జఠ్మలానీ. మొదటి సినిమాతో అనుకున్నంతస్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన కామ్నా మూడో సినిమా ‘రణం’తో సూపర్‌హిట్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె నటనకు దూరమయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె తిరిగి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షోలో కామ్నా పాల్గొని తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఇందులో భాగంగానే ఒకానొక సమయంలో తాను చైనాకు వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో తన వద్ద పాస్‌పోర్ట్‌ కూడా లేదని.. దాంతో అక్కడ జరిగిన ఓ సంఘటనతో తాను భయానికి లోనయ్యానని.. ఆ తర్వాత మరలా చైనా వైపు చూడలేదని ఆమె అన్నారు. ఓ ప్రముఖ దర్శకుడు తనని జూనియర్‌ శ్రీదేవి అనే పిలిచేవారని పేర్కొంటూ ఆమె ఆనాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం, కామ్నా కోసం ఓ స్పెషల్‌ పర్సన్‌ పంపించిన వీడియో క్లిప్‌ని ఆలీ ప్లే చేసి చూపించగానే ఆమె ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఆ వీడియో క్లిప్‌ పంపించింది ఎవరు? కామ్నా ఏ దర్శకుడితో పని చేయాలనుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే వచ్చే వారం ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ వీక్షించాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని