Unstoppable 2: ‘దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలి..’ నవ్వులు పూయిస్తున్న అన్‌స్టాపబుల్‌ లేటెస్ట్ ప్రోమో..

‘అన్‌స్టాపబుల్‌-2’ సరికొత్త ప్రోమో విడుదలైంది. యంగ్‌ హీరోలు శర్వానంద్‌, అడవి శేష్‌ బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఆసక్తికర ప్రశ్నలతో నవ్వులు పూయిస్తోంది ఈ ప్రోమో.

Updated : 01 Nov 2022 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్‌స్టాపబుల్‌-2(Unstoppable 2) కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ షోలో తనదైన శైలిలో అలరిస్తూ.. వచ్చిన అతిథులతో సందడి చేస్తున్నారు బాలకృష్ణ(Bala krishna).  మొదటి సీజన్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు రెండో సీజన్‌లో మంచి జోష్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షోలో మూడో ఎపిసోడ్‌కు యువ హీరోలు శర్వానంద్‌, అడవి శేష్‌ హాజరయ్యారు. ‘దెబ్బకు థింకింగ్‌ మారి పోవాలి..’ లాంటి ఆసక్తికర పంచులతో ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.

‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికీ బాలుడే..’ అని శర్వానంద్‌ చెప్పిన మాటకు స్టేజంతా చప్పట్లతో మారుమోగింది. ఇక బాలకృష్ణ కోసం రష్మికకు వీడియోకాల్‌ చేశాడు శర్వానంద్‌. ఆ హీరోయిన్‌తో ముద్దుసీన్‌లు వద్దని చెప్పాడు అడవి శేష్‌.  ‘మీరెంత చెప్పినా ఎడిటింగ్‌ ఉండేది నా చేతిలోనే’ అంటూ పంచ్‌లు వేశారు బాలకృష్ణ. ‘సెల్ఫీ అడిగితే చెంప పగల కొట్టిన హీరో ఎవరు?’ ప్రశ్నకు మరి ఈ యంగ్‌ హీరోలు ఏం సమాధానం చెప్పారు.. వీరిద్దరూ కలిసి బాలయ్యతో చేసిన సందడి ఈ ప్రోమోలో మీరు చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు