Leo: ఓటీటీలోకి ‘లియో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

విజయ్‌(Vijay) తాజా చిత్రం ‘లియో’ ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అలరించనుంది.

Updated : 20 Nov 2023 13:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘లియో’ (Leo). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లును రాబట్టింది. ఇప్పుడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. అయితే భారత్‌లో నవంబర్‌ 24 నుంచి ప్రసారం కానుండగా.. ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఓ ట్రైలర్‌ను విడుదల చేసింది. విజయ్‌ సరసన త్రిష నటించిన ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈవారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే..

క‌థేంటంటే: పార్తి అలియాస్ పార్తిబ‌న్ (విజ‌య్‌) హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని థియోగ్‌లో స్థిర‌ప‌డిన తెలుగువాడు. ఓ కేఫ్ న‌డుపుకొంటూ 20ఏళ్లుగా అక్క‌డే కుటుంబంతో క‌లిసి జీవనం సాగిస్తుంటాడు. అత‌ని భార్య స‌త్య (త్రిష‌). వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమ‌కు గుర్తుగా ఓ బాబు.. పాప.  హాయిగా.. సంతోషంగా సాగిపోతున్న‌ పార్తి జీవితం ఓ క్రిమిన‌ల్‌ ముఠా వ‌ల్ల‌ త‌ల‌కిందుల‌వుతుంది. ఓ రాత్రి త‌న కేఫ్‌లోకి వ‌చ్చి డ‌బ్బులు దోచుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన ఆ ముఠాను అక్క‌డిక్క‌డే కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేస్తారు.  అయితే త‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే వాళ్ల‌ను చంపిన‌ట్లు కోర్టులో తేల‌డంతో నిర్దోషిగా విడుద‌ల‌వుతాడు. కానీ, ఓ వార్తా ప‌త్రిక‌లో అత‌ని ఫొటో చూసిన ఆంటోని దాస్‌ (సంజ‌య్ ద‌త్‌) గ్యాంగ్ పార్తిని వెతికి ప‌ట్టుకొని.. చంపేందుకు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరుతుంది. దీనికి కార‌ణం 20ఏళ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన ఆంటోని కొడుకు లియోలా పార్తిబ‌న్ ఉండ‌ట‌మే. మ‌రి ఈ లియో ఎవ‌రు? అత‌ను.. పార్తిబ‌న్ ఒక్క‌డేనా?లేక ఇద్ద‌రా? సొంత కొడుకునే చంపాల‌ని ఇటు లియో తండ్రి ఆంటోని, అత‌ని అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్‌) ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు? వీళ్ల‌కు లియోకూ ఉన్న వైరం ఏంటి?పార్తి గ‌త‌మేంటి? ఆంటోని గ్యాంగ్ నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడన్నది కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని