Maataraani Mounamidhi: ఓటీటీలో ‘మాటరాని మౌనమిది’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మల్టీ జానర్ మూవీ ‘మాటరాని మౌనమిది’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది!
హైదరాబాద్: మహేష్ దత్త (Mahesh Dutta), సోని శ్రీవాస్తవ(Sony Srivastava) జంటగా నటించిన చిత్రం ‘మాటరాని మౌనమిది’ (MataRani Mounamidi). సుకు పూర్వాజ్ దర్శకుడు. వాసుదేవ్, ప్రభాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టులో థియేటర్‌లో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆహా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్టీ జానర్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. అంటే థ్రిల్లర్, హారర్, కామెడీ అన్నింటికీ మిక్స్ చేసి, ‘మాటరాని మౌనమిది’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. తొలుత ఈ సినిమాను ‘పుష్పకవిమానం’ తరహాలో మూకీగా తీద్దామనుకున్నారట. అయితే, నిర్ణయాన్ని విరమించుకుని ప్రధాన పాత్రలకి సంభాషణలు లేకుండా చేశారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆ సందర్భాన్ని వాళ్లెలా దాటుకుని ముందుకు వెళతారన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు