Manchu Vishnu: పాన్‌ ఇండియా స్థాయిలో మంచు విష్ణు సినిమా.. పేరేంటంటే..?

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఇది తనన కలల ప్రాజెక్ట్‌ అని విష్ణు తెలిపారు.

Updated : 18 Aug 2023 16:23 IST

హైదరాబాద్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ సినిమాకు ‘కన్నప్ప’ (kannappa) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

‘కల్కి’లో దుల్కర్‌.. పరోక్షంగా చెప్పేశాడుగా..!

హిందీలో మహాభారతం సిరీస్‌ను రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రానుంది. ఇక దీన్ని అవా ఎంటర్‌ టైనర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మించనున్నారు. ఇందులో మంచు విష్ణు సరసన కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ నటిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘అత్యంత భారీ బడ్జెట్‌తో, ఉన్నతమైన సాంకేతిక అంశాలతో ‘భక్త కన్నప్ప’ రూపొందిస్తున్నాం. కన్నప్ప భక్తిని ఈ సినిమాలో చూపించనున్నాం. సింగిల్‌ షెడ్యూల్‌లోనే సినిమా షూటింగ్‌ మొత్తాన్ని పూర్తి చేస్తాం. చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటీనటులు ఇందులో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు. ఇక ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్‌, తోట ప్రసాద్‌ తదితరులు పనిచేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని