
మంచు వారి సినిమాలో మెగా హీరో
హైదరాబాద్: మంచు, మెగా కుటుంబాలకు చెందిన హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే సినీ ప్రియుల ఆశ నెరవేరనున్నట్లు తెలుస్తోంది. మంచు కుటుంబానికి చెందిన ఓ హీరో సినిమాలో కొణిదెల వారి మేనల్లుడు నటించనున్నట్లు సమాచారం. ఇంతకీ వెండితెరపై కలిసి సందడి చేయనున్న ఆ హీరోలు ఎవరంటే మనోజ్, సాయిధరమ్ తేజ్. కొన్నేళ్ల విరామం తర్వాత మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’.
శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ ఓ అతిథి పాత్రలో మెప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనోజ్‌తో స్నేహం ఉండడంతో ఆయన అడిగిన వెంటనే సినిమాలో నటించేందుకు సాయి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు చిరు-మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లారంగా’ను మనోజ్, సాయిధరమ్ తేజ్ రీమేక్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం విధితమే.