Kannappa: ‘కన్నప్ప’ షూట్‌లోకి స్టార్‌ హీరోల ఎంట్రీ.. ఫొటో వైరల్‌

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) షూటింగ్‌లో స్టార్ హీరోలు భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఫొటో షేర్‌ చేసింది.

Published : 09 Nov 2023 17:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో చాలా మంది అగ్ర నటులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రీకరణలో స్టార్‌ హీరోలు మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌లు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఫొటోను షేర్‌ చేసింది.

‘ఇద్దరు లెజెండరీ హీరోలు షూటింగ్‌లో భాగమయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అద్భుతమైన సినిమాకు వారి పవర్‌ను అందించనున్నారు. ఈ గొప్ప పురాణ కథ కోసం సిద్ధంగా ఉండండి’ అని చిత్రబృందం పేర్కొంది.  ప్రస్తుతం ఆ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. విష్ణు ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘కన్నప్ప’లో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌,  కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar)లు కూడా కీలకపాత్రలు పోషించనున్నారు.

ఇది వరమా లేక శాపమా: కీర్తి సురేశ్‌ అసహనం

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారు. దీని కోసం 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు ఆర్ట్‌ వర్క్‌ చేయించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాను మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇటీవలే దీని షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి చిత్రీకరణలో భాగమవుతారని మోహన్ బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని