Naga Chaitanya: చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో నాగ చైతన్య సందడి.. ఫొటోలు చూశారా!

హీరో నాగ చైతన్య చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. సంబంధిత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Published : 17 Nov 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న అక్కడి చిన్నారులతో సరదాగా గడిపారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఆ చిన్నారులకు బహుమతులు అందించారు. వారితో కాసేపు సరదాగా ఆటలు ఆడారు. డ్యాన్స్‌ చేసి వారిని ఉల్లాసపరిచారు. సంబంధిత ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వాటిలో నాగ చైతన్య.. ఓ చిన్నారి ఏదో చెబుతుంటే శ్రద్ధగా వింటూ, మ్యూజికల్‌ ఛైర్‌ గేమ్‌ ఆడుతూ కనిపించారు.

‘ప్రభాస్‌ మీపై కోప్పడ్డారా?’: ప్రభాస్‌ శ్రీను ఏమన్నారంటే?

ఈ ఏడాది ‘కస్టడీ’తో ప్రేక్షకులను పలకరించిన నాగ చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు చైతన్య. ఇందులో సాయి పల్లవి కథానాయిక. మరోవైపు, నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని