Nagarjuna: నాగచైతన్యను మెచ్చుకున్న నాగార్జున..!

నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘దూత’ (Dhootha) సిరీస్‌ను తాజాగా నాగార్జున (Nagarjuna) వీక్షించారు. సిరీస్‌ తనకెంతో నచ్చిందన్నారు.

Updated : 03 Dec 2023 15:14 IST

హైదరాబాద్‌: నాగచైతన్య (Naga Chaitanya) నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దూత’ (Dhootha). ఈ వెబ్‌సిరీస్‌కు విక్రమ్‌ కె. కుమార్‌ (Vikram K Kumar) దర్శకత్వం వహించారు. ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను తాజాగా నాగార్జున వీక్షించారు. నాగచైతన్య నటన అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ‘‘దూత’ సిరీస్‌ను తాజాగా చూశాను. ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చై అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. అతడి నటన చూసి ఆశ్చర్యపోయా. టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని నాగ్‌ ట్వీట్‌ చేశారు.

Family Star: సంక్రాంతి రేస్‌ నుంచి పక్కకు జరిగిన ‘ఫ్యామిలీ స్టార్‌’.. కారణమదే

కథేంటంటే:

సాగర్‌ వర్మ అవధూరి (నాగచైతన్య) ప్రముఖ జర్నలిస్ట్‌. కొత్తగా ప్రారంభం కాబోయే సమాచార్‌ పత్రికకు చీఫ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతడి సహాయకురాలిగా అమృత (ప్రాచీ దేశాయ్‌), మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ చంద్రమూర్తి (వి.జయ ప్రకాష్‌)లు కూడా అదే రోజున ఉద్యోగంలో చేరతారు.  ఓరోజు సాగర్‌కు ఓ పేపర్‌ క్లిప్‌ దొరుకుతుంది. అందులో అతడి శునకం (ఎ) మరణించినట్లు రాసి ఉంటుంది. ఆ క్లిప్‌ చూసిన కొద్ది సేపటికే ఆ శునకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతుంది. అలా, సాగర్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతడిని కలిసిన వారు ఏదో ఒక కారణంతో చనిపోతూ ఉంటారు. వారు ఎలా చనిపోబోతున్నారో ముందే తెలియజేస్తూ ఓ పాత న్యూస్‌పేపర్‌ ఆర్టికల్‌ క్లిప్పింగ్స్‌ సాగర్‌కు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్‌ అయిన సాగర్‌ జీవితం ఎలా మలుపులు తిరిగింది? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సాగర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఈ హత్యలకు స్వాతంత్య్ర సమరయోధుడు, స్వరాజ్యం వచ్చిన తర్వాత ‘దూత’ పత్రిక నిర్వాహకుడు సత్యమూర్తి (పశుపతి)కి సంబంధం ఏమిటి? ఈ కేసులను డీసీపీ క్రాంతి షినోయ్‌ (పార్వతి తిరువత్తు) ఎలా ఛేదించింది? అనే అంశాలతో ఇది సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని