
Dasara: సీరియస్ లుక్‌లో నాని.. వీడియో చూశారా..!
హైదరాబాద్: తరచూ కామెడీ, లవ్, ఫ్యామిలీ కథలతో మెప్పించే హీరో నాని.. గత కొంతకాలంగా తన పంథాను మార్చుకుని విభిన్నమైన జోనర్స్‌లో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ వంటి ఫీల్‌గుడ్, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో సక్సెస్‌ని సొంతం చేసుకున్న ఆయన నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తిసురేశ్ కథానాయిక. సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగే సీరియస్ కథ ఇది. ఇటీవల పూజా కార్యక్రమాల అనంతరం ఈసినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. కాగా, తాజాగా ‘దసరా’ టీమ్ ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాని ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసింది. ఇందులో ఆయన ధరణి రోల్‌లో మునుపెన్నడూ చూడని విధంగా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ విడుదల కానుంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోషన్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
Movies News
Shamshera: బాహుబలి, కేజీఎఫ్‌లను తలపించేలా ‘షంషేరా’ ట్రైలర్!
-
General News
Railway Police: సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసుల నోటీసులు..
-
Business News
Car Loan: కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ముుందు ఈ రూల్ గురించి తెలుసుకోండి..
-
Movies News
Dil Raju: ఫిల్మ్ ఫెడరేషన్తో చర్చలు.. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం: దిల్‌రాజు
-
General News
CM Jagan: కిదాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను సన్మానించిన సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- Samantha: సమంత వ్యూహం ఫలించిందా?