No Entry: అడవిలో సాహసం.. ప్రమాదకరమైన కుక్కల నుంచి ఎలా తప్పించుకున్నారు?
ఆండ్రియా కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నో ఎంట్రీ’ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
హైదరాబాద్: ఏనుగునైనా చంపేయగల ప్రమాదకరమైన అడవి కుక్కలు అవి. ఎస్ 40 అనే ఔషధంతో వాటిలో కొత్తగా వైరస్ కూడా పుట్టింది. దట్టమైన ఓ అడవిలో ఆ ప్రమాదకరమైన కుక్కల మధ్య చిక్కుకున్న కొద్దిమంది స్నేహితులకి ఎలాంటి అనుభవం ఎదురైంది? వాటి నుంచి తప్పించుకున్నారా లేదా? తెలియాలంటే ‘నో ఎంట్రీ’ (No Entry) చూడాల్సిందే. ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah) ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది. ఆర్.అళగు కార్తీక్ దర్శకత్వం వహించారు. శ్రీధర్ అరుణాచలం నిర్మాత. త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఆండ్రియా చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయి. ప్రతీ సన్నివేశం థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంద’’ని తెలిపాయి సినీ వర్గాలు. అదవ్, కణ్ణదాసన్, రన్యరావ్, మానస్, జయశ్రీ, జాన్‌వీ తదితరులు నటించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్