Ott movies this week: కామెడీ + యాక్షన్‌ + ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌.. ఈ వారం ఓటీటీలో రానున్న చిత్రాలు/సిరీస్‌లివే

ott movies this week: ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరికొన్ని వీకెండ్‌లో సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేయండి.

Published : 03 Aug 2023 14:35 IST

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’

నాగశౌర్య (Naga Shaurya) కథానాయకుడిగా పవన్‌ బాసంశెట్టి రూపొందించిన చిత్రం ‘రంగబలి’ (Rangabali). గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా నాగశౌర్య, సత్యల నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఇప్పుడిదే చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రియురాలితో తన పెళ్లికి అడ్డుగా ఉన్న రాజవరంలోని ‘రంగబలి’ సెంటర్‌ పేరును మార్చడానికి శౌర్య (నాగశౌర్య) ఏం చేశాడు? ఆ సెంటర్‌ కథేంటి? హీరోయిన్‌ తండ్రికి రాజవరంలోని ఆ సెంటర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికర అంశంతో ఇది సిద్ధమైంది.


కామెడీ కోసం ‘పరేషాన్‌’

యువ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నటుడు రానా ఎప్పుడూ ముందుంటారు. ఆయన సమర్పణలో ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘పరేషాన్‌’ (Pareshan). రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకుడు. తిరువీర్‌, పావని, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం సోనీలీవ్‌ ఓటీటీ వేదికగా ఆగస్టు 4 నుంచి ప్రేక్షకులను అలరించనుంది.


యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దయ’

నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) నటించిన సరికొత్త ప్రాజెక్ట్‌ ‘దయ’ (DAYAA). పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. విష్ణు ప్రియ, ఈషా రెబ్బా, పృథ్వీరాజ్‌, కమల్‌ కామరాజు కీలకపాత్రలు పోషించారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సిద్ధమైన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరిన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • చూనా (హిందీ సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • హార్ట్‌స్టాపర్ సీజన్ 2 (సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 4
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ధూమం (కన్నడ, తెలుగు) ఆగస్టు 4
  • డిస్నీ + హాట్‌స్టార్‌ 
  • ది ఫస్ట్‌ రెస్పాండర్స్‌ - 2 (సిరీస్‌) ఆగస్టు 4
  • సోనీలీవ్‌
  • ఫటాఫటీ - ఆగస్టు 4
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని