ott movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ott movies this week: ఈ వారం థియేటర్‌లో అన్నీ చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలో ఏయే చిత్రాలు ఉన్నాయా? అని వెతికేస్తున్నారా? అయితే, ఆ జాబితా మీకోసమే!

Published : 17 Aug 2023 17:44 IST

వెబ్‌సిరీస్‌లో దుల్కర్‌సల్మాన్‌

రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman), ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (Guns and Gulaabs)’. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రసారం కానుంది.  ఒక విభిన్న కథతో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’తో ప్రేక్షకులను అలరించిన రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే (Raj and DK) ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు.


దశరథ్‌ స్టైల్‌లో ‘లవ్‌ యూ రామ్‌’

‘చాలామంది ప్రేమించడమే జీవితం అనుకుంటారు. కానీ నమ్మించడమే జీవితం అంటాడు ఆ కుర్రాడు. చిన్నప్పట్నుంచి ఒకడినే ప్రేమిస్తూ అతనే రాముడు దేవుడు అని నమ్మి జీవితాన్ని అంకితం చేసింది ఆ అమ్మాయి. భిన్నమైన మనస్తత్వాలున్న ఈ ఇద్దరి ప్రేమకథ ఎక్కడిదాకా సాగింది? ఎక్కడ ముగిసిందో తెలియాలంటే ‘లవ్‌ యూ రామ్‌’ (Love You Ram) చూడాల్సిందే. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధనన్‌ జంటగా నటించిన చిత్రమిది. డి.వి.చౌదరి దర్శకత్వం వహించడంతోపాటు, కథని సమకూర్చిన ప్రముఖ దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి నిర్మించారు. ఆహా వేదికగా ఆగస్టు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ ‘ఓ సాథియా’ వచ్చేసింది!

ఆర్యన్‌గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా (O Saathiya)’. దివ్యభావన దర్శకురాలు. జులై 7న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా గురువారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • మాస్క్‌ గర్ల్ (కొరియన్‌) ఆగస్టు 18
  • 10 డేస్‌ ఆఫ్‌ బ్యాడ్‌మ్యాన్‌ (టర్కిష్‌) ఆగస్టు 18
  • ది మంకీ కింగ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 18
  • ఆహా
  • క్లూ (తెలుగు) ఆగస్టు 18
  • హిడింబ (తమిళ్‌) ఆగస్టు 18
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ఏపీ థ్రిల్లాన్‌: ఫస్ట్‌ ఆఫ్‌ ఏ కైండ్‌ (హిందీ) ఆగస్టు 18
  • హర్లాన్‌ కోబెన్స్‌ షెల్టర్‌ (ఇంగ్లీష్‌-సిరీస్‌1) ఆగస్టు 18
  • అమల (మలయాళం) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మాతంగం (తమిళ్‌) ఆగస్టు 18
  • సోనీలివ్‌
  • అయిరతోన్ను నునక్కళ్‌ (మలయళం) ఆగస్టు 18
  • జియో సినిమా
  • షజమ్‌: ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని