Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా? పవన్‌-రానా అదరగొట్టేశారు!

పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు.

Published : 24 Feb 2022 01:46 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌, రానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన  ప్రీరిలీజ్‌ వేడుకలో చిత్ర కొత్త ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా పవన్‌-రానాల మధ్య సన్నివేశాలను నువ్వా-నేనా అన్నట్లు తీర్చిదిద్దారు. ఇంకెందుకు ఆలస్యం మాస్‌ ట్రైలర్‌ మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని