OG: ఆ బ్లాక్‌బస్టర్‌ విడుదలైన రోజు ‘ఓజీ’?.. ‘ఊరు పేరు భైరవకోన’ న్యూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌

పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’, సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాల విడుదల తేదీల వివరాలివీ..

Published : 30 Jan 2024 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ సినిమా ఘన విజయాన్ని అందుకుంటే దాని విడుదల తేదీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. అలాంటి వాటిలో సెప్టెంబరు 27 ఒకటి. 2013లో అదే రోజున ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) విడుదలవడం అందుకు కారణం. అదే డేట్‌కు ‘ఓజీ’ (OG)ని తీసుకురానున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇదే టాపిక్‌ ట్రెండింగ్‌లో ఉంది. చిత్ర బృందం నుంచి ప్రకటన వెలువడలేదు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా ‘సాహో’ ఫేమ్‌ సుజీత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘ఓజీ’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌- సుజీత్‌ కాంబోలో ఈ సినిమా ప్రకటన వెలువడమే ఆలస్యం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతేడాది విజులైన గ్లింప్స్ అంచనాలు మరింత పెంచాయి. పవన్‌- త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’.. విడుదలకు ముందే పైరసీకి గురైన బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించడం విశేషం.

17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్‌, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్‌ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!

‘ఊరు పేరు భైరవకోన’ విడుదల ఆరోజే..

సందీప్‌ కిషన్‌ (sundeep kishan) హీరోగా దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లు. ఈ ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరి నుంచి వైదొలిగిన రవితేజ ‘ఈగల్‌’ చిత్రానికి సోలో రిలీజ్‌ డేట్‌ ఇస్తామని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మాటిచ్చింది. ఆ మేరకు ఫిబ్రవరి 9న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే తేదీకి ‘ఊరు పేరు భైవరకోన’, ‘లాల్‌ సలామ్‌’, ‘యాత్ర 2’ రిలీజ్‌కు రెడీ అవగా చర్చల అనంతరం ‘.. భైరవకోన’ వాయిదా పడింది. ఫిబ్రవరి 16న విడుదల చేసేందుకు టీమ్‌ అంగీకరించింది. తాజాగా.. అధికారికంగా ప్రకటిస్తూ సంబంధిత పోస్టర్‌ను పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని