OG: ‘ఓజీ’ వచ్చేది ఆరోజే.. విడుదల తేదీని ప్రకటించిన టీమ్‌..

సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటిస్తోన్న ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించారు.

Published : 06 Feb 2024 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) (OG).  ‘సాహో’ (Saaho) ఫేం సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో ఇది రానుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని వెల్లడించారు. రిలీజ్‌ విషయంలో ఎన్నో రోజులుగా వినిపిస్తోన్న తేదీనే చిత్రబృందం ఖారారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi). ఈ సినిమా కూడా 2013లో సెప్టెంబరు 27నే విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ‘ఓజీ’ రానుండటంతో పవన్‌ ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమంటున్నారు. 

‘ఈగల్‌’ టీమ్‌ డేరింగ్‌ స్టెప్‌.. అందుబాటు ధరలో మూవీ టికెట్స్‌.. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

‘ఓజీ’ విషయానికొస్తే.. ముంబయి - జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్ ప్రియాఅరుళ్‌ మోహన్‌.  బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గరినుంచే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. గతేడాది విడుదలైన దీని గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మరోవైపు, పవన్‌.. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సముద్రఖని డైరెక్షన్‌లో ‘పీకేఎస్‌డీటీ’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని