Prabhas-Anushka: ప్రభాస్‌-అనుష్కల జోడి మరోసారి స్క్రీన్‌పై మెరవనుందా!

ప్రభాస్, అనుష్క వెండితెరపై కనిపిస్తున్నారంటే అభిమానుల్లో సందడి నెలకొంటుంది. ఇప్పుడీ జోడి మరోసారి కనిపించనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

Updated : 01 Aug 2023 18:57 IST

హైదరాబాద్‌: వెండితెరపై కొన్ని జోడీలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అలాంటి ఒక జోడీనే ప్రభాస్-అనుష్కలది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్‌పై మెరవనుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారడంతో ప్రభాస్, అనుష్కల (Anushka) అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఖుష్‌ అవుతున్నారు. 

‘బాహుబలి’ చిత్రాలను నిర్మించి అందరి ప్రశంసలు పొందారు శోభూ యార్లగడ్డ. ఇప్పుడీ నిర్మాత మరోసారి ప్రభాస్, అనుష్కలతో ఓ భారీ బడ్జెట్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నారట. దీనికోసం ప్రభాస్‌తో (Prabhas) చర్చలు కూడా జరిపారని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, వార్త మాత్రం సోషల్‌ మీడియాలో తెగ షేర్ అవుతోంది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి. దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తే అది కచ్చితంగా మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందని భావిస్తున్నారు. 

‘ఆదిపురుష్‌’ విషయంలో జరిగిన తప్పు ‘కల్కి’కి జరగకూడదని..

ఇక ప్రభాస్‌కు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) త్వరలోనే ప్రభాస్‌ (Prabhas)తో ఓ సినిమా ప్లాన్‌ చేశారట. భారీ బడ్జెట్‌ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. మైత్రీమూవీస్‌ మేకర్స్‌పై ఇది రానుందని టాక్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ.. తాను ‘లియో’ షూటింగ్‌తో బిజీగా ఉన్నానని.. అది పూర్తి కాగానే ప్రభాస్‌తో తీసే సినిమాపై క్లారిటీ ఇస్తానని అన్నారు. ఇక ‘లియో’ షూటింగ్‌ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నిర్మాణానంతర పనులు అయ్యాక ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 ప్రస్తుతం నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో ప్రభాస్‌ నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ‘సలార్‌’ (Salaar) చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సందడి చేశాయి. వీటితో పాటు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్‌’(Spirit) మూవీకి ఓకే చెప్పిన విసయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని