Prabhas: ‘పఠాన్‌’ డైరెక్టర్‌తో ప్రభాస్‌ మూవీ ..

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్(Prabhas)‌. ఈ క్రేజీ హీరో తర్వాత ప్రాజెక్ట్‌ గురించి మైత్రీ మూవీస్‌ సంస్థ తెలిపింది. 

Published : 16 Jan 2023 01:58 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ (Baahubali) తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్ (Prabhas)‌. గతేడాది ‘రాధేశ్యామ్’‌ (Radheshyam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand)తో ప్రభాస్‌ తర్వాత చిత్రం ఉండనుందని గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) తాజాగా ఈ విషయంపై ప్రకటన చేసింది.

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ అగ్ర హీరోలు నటించిన రెండు సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీస్‌ సంస్థ.. ప్రభాస్‌ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. సిద్ధార్థ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ సినిమా ఉంటుందని ఈ సంస్థ ప్రతినిధులు ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందించిన ‘పఠాన్‌’ (Pathaan) సినిమా 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇక ప్రభాస్‌ విషయానికొస్తే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ స్టార్‌ హీరో. ‘కేజీయఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌’(Salaar) సినిమా చేస్తున్నారు. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటుంది. అలాగే నాగ్‌ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్‌ కే’(Project K) పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె(Deepika Padukone)అలరించనుంది. ఇక వీటితో పాటు ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’(Adipurush)లో నటిస్తున్నారు. ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం విడుదలవ్వనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు