Priyanka Chopra: అందుకే నిక్‌ పేరును తొలగించా.. విడాకుల రూమర్స్‌పైప్రియాంక ఏమందంటే?

సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన భర్త నిక్‌ జొనాస్‌ పేరు తొలగించటంతో ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Published : 14 Jan 2022 21:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన భర్త నిక్‌జొనాస్‌ పేరు తొలగించటంతో ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌కు గతంలోనే చెక్‌ పెట్టిన ఆమె మరోసారి స్పందించారు. ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా ఎందుకు జరిగిందో వివరించారు. వృత్తిపరమైన కారణాల వల్ల తన భర్త పేరును తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. జరిగింది ఒకటైతే కొందరు సోషల్‌ మీడియా వేదికగా మరో రకంగా చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. చాలామంది తమ జీవితంలో సోషల్‌ మీడియాకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అది అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఫొటోని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటారని అన్నారు.

ప్రియాంక చోప్రా తన భర్త పేరును తీసేయటం గతేడాది నవంబరులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిక్‌ జొనాస్‌ పెట్టిన పోస్ట్‌కి ప్రియాంక రొమాంటిక్‌ కామెంట్‌ పెట్టి, ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల.. ‘ది మ్యాట్రిక్స్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ప్రియాంక పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘జీ లే జరా’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్‌లో సందడి చేయబోతుంది. ఆలియాభట్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో ఫర్హాన్‌ అక్తర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని