Agent: ‘ఏజెంట్‌’ రిలీజ్‌పై వదంతులు.. స్పందించిన నిర్మాత

అఖిల్‌ (Akhil), సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). ఈ సినిమా రిలీజ్‌ విషయంపై వస్తోన్న రూమర్స్‌కు చెక్‌ పెట్టారు చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర.

Updated : 16 Apr 2023 11:43 IST

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని (Akhil) హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్‌’ (Agent). సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్‌ 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్‌’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌పై గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. నైజాంలో ఈచిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదంటూ జరుగుతోన్న ప్రచారంపై తాజాగా నిర్మాత అనిల్‌ సుంకర స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు. తమ చిత్రాన్ని ఇప్పటికే వేరే వాళ్లకు అమ్మేశామని చెప్పారు.

‘‘ఈ చిత్రాన్ని రెండు నెలల ముందే మేము వేరే వాళ్లకు అమ్మేశాం. ఒక్కసారి అమ్మేసిన తర్వాత ఏ బయ్యర్‌కు ఇవ్వాలనేది కొన్నవారి ఇష్టం. నైజాంలో ఉన్న ప్రధాన డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్‌ చేసి.. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. సినిమాని వేరే వాళ్లకు అమ్మేశామని.. వాళ్లతో సంప్రదింపులు జరపాలని చెప్పాను’’ అని శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో అనిల్‌ (Anil Sunkara) స్పష్టత నిచ్చారు.

ఇదే కార్యక్రమంలో నాగచైతన్య (Naga Chaitanya)తో కలిసి నటించడంపై అఖిల్‌ మాట్లాడారు. ‘‘మల్టీస్టారర్‌ సినిమా చేయడం సులభమే కానీ, అన్నాదమ్ములు కలిసి చేస్తే ఎన్నో విషయాలు ఆలోచించాలి. పాత్రలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా తీర్చిదిద్దారు? ఇలా పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి లుక్‌పరంగా చూస్తే నాకంటే ఆయనే యంగ్‌గా ఉన్నారు. అభిమానుల కోసం తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తాం. సరైన స్క్రిప్ట్‌ వచ్చినప్పుడు మేమే అనౌన్స్‌ చేస్తాం’’ అని బదులిచ్చారు. అనంతరం రిలేషన్‌షిష్‌ స్టేటస్‌పై ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం ఏజెంట్‌పైనే ఉందంటూ మాట దాటవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని