Pawan Kalyan - Trivikram: పవన్‌కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ మూవీ.. నిర్మాత ఏమన్నారంటే..?

పవన్‌కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబో గురించి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత స్పందించారు.

Published : 03 Feb 2024 18:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్‌లో హిట్‌ కాంబోగా పేరు తెచ్చుకున్నారు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) - త్రివిక్రమ్‌ (Trivikram). ‘అజ్ఞాతవాసి’ పరాజయం తర్వాత వీరిద్దరూ కలిసి పూర్తిస్థాయి సినిమా చేయలేదు. ఈ కాంబోలో మంచి సినిమా వస్తే చూడాలని దాదాపు ఆరేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమయంలోనే త్రివిక్రమ్‌ - పవన్‌కల్యాణ్‌ కాంబోలో సినిమా చేయాలని ప్లాన్‌ చేశాం. వాళ్లిద్దరూ ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. అప్పుడు పట్టాలెక్కిస్తాం’’ అని అన్నారు. తమ బ్యానర్‌పై ఈ ఏడాది దాదాపు 15 చిత్రాలు విడుదల కానున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆరు చిత్రాల షూట్‌ పూర్తయ్యాయన్నారు.

Maruthi: ఆయనంటే నాకెంత ఇష్టమో ‘రాజా సాబ్‌’లో చూస్తారు..: మారుతి

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమైన ‘ఈగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. రవితేజ - కావ్యథాపర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్‌ ఘట్టమనేని దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇది ఫిబ్రవరి 9న విడుదల కానుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వప్రసాద్‌ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌ చిత్రాల గురించీ మాట్లాడారు. ప్రభాస్‌ హీరోగా తాము నిర్మిస్తోన్న ‘రాజాసాబ్‌’ను సరైన సమయంలోనే విడుదల చేస్తామన్నారు. ‘ఓజీ’ని తాము టేకోవర్‌ చేస్తున్నామంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పైనే అది నిర్మితమవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని