Kangana Ranaut: కంగనా రనౌత్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రజనీకాంత్‌..

కంగనా రనౌత్ (Kangana Ranaut) కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా సెట్స్‌కు రజనీకాంత్‌ వెళ్లి ఆమెను సర్‌ప్రైజ్‌ చేశారు.

Published : 18 Nov 2023 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌.మాధవన్-కంగనా రనౌత్‌లు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. ‘తను వెడ్స్‌ మను’తో అలరించిన ఈ జోడి ఇప్పుడు మరోసారి స్క్రీన్‌పై కనిపించనుంది. ఈసారి ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌తో భయపెట్టడానికి వీళ్లిద్దరూ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా పోస్ట్‌ చేశారు. ఓ సరికొత్త కథాంశంతో రానున్న తమిళ చిత్రంలో మాధవన్‌తో కలిసి తాను నటించనున్నట్లు చెప్పారు. విజయ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలైందన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

ఇక ఈ సెట్స్‌కు రజనీకాంత్ వచ్చి తనను సర్‌ప్రైజ్‌ చేసినట్లు కంగనా రనౌత్ చెప్పారు. ‘భారతీయ సినిమా దేవుడిగా చెప్పే తలైవా మా సెట్స్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే మాధవన్‌ కూడా ఈ షూటింగ్‌లో భాగం కానున్నారు’ అంటూ రజనీతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ఇక మరోవైపు కంగనా రనౌత్‌  స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ (Emergency) రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని