Hero: ‘ఆహా’లో అలరించనున్న ‘హీరో’

ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందిస్తోంది ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’. ఇప్పటికే

Updated : 14 Jul 2021 05:36 IST

హైదరాబాద్‌: ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందిస్తోంది ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’. ఇప్పటికే పలు చిత్రాలు నెటిజన్లను ఆకర్షించాయి. కాగా, మరో కన్నడ బ్లాక్‌ బస్టర్‌ త్వరలోనే ‘ఆహా’లో విడుదల కానుంది. రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భరత్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘హీరో’ పేరుతోనే అలరించేందుకు సిద్ధమైంది. ‘బెల్‌బాటమ్‌’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన నటుడు రిషభ్‌శెట్టి ఇందులో నటించారు. బ్లాక్‌ కామెడీ నేపథ్యంతో రూపొందించిన ఈ సినిమా జులై 24న ‘ఆహా’లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని