Oscars 2024: ఆస్కార్‌ వేదికపై మరోసారి ‘RRR’.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ మరోసారి మెరిసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 11 Mar 2024 11:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఈ ఏడాది ఆస్కార్‌ వేదికపైన మరోసారి మెరిసింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం వేడుకగా జరిగింది. ఇందులో మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

గతేడాది బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోట్ల మంది భారతీయుల కలను నిజం చేసిన ఆ పాటలోని స్టెప్స్‌ తాజాగా జరిగిన ఆస్కార్‌ ప్రదానోత్సవంలోనూ కనిపించాయి. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డును ప్రకటించే క్రమంలో తెరపై ‘నాటునాటు’ పాటను ప్రదర్శించారు. అలాగే ఇప్పటి వరకు సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ స్టంట్స్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై చూపించారు. ఇందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని రెండు యాక్షన్‌ షాట్స్‌ను చూపడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో సినీప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రపంచం ఇంకా నాటునాటు ఫీవర్‌ నుంచి బయటకు రాలేకపోతోంది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

విమర్శలను ఎదుర్కొని విజేతగా నిలిచి.. ‘ఓపెన్‌హైమర్‌’ ఆసక్తికర విషయాలివే..

ఇక ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్ అవార్డు ‘బార్బీ’ చిత్రంలోని ‘వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌’ అనే పాటకు వచ్చింది. ఈసారి ఆస్కార్‌లో క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) హవా కొనసాగింది. ఉత్తమ చిత్రంతో సహా మొత్తం ఏడు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది (Oscar Awards 2024).



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని