Salman Khan: ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..!

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

Published : 16 Jun 2023 16:46 IST

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) - పూజాహెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రీసెంట్‌ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్‌’, తెలుగులో వచ్చిన ‘కాటమరాయుడు’ చిత్రాలకు రీమేక్‌గా బాలీవుడ్‌లో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫర్హద్‌ సమ్జీ దర్శకుడు. వెంకటేశ్‌, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను సల్మాన్‌ఖాన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. జూన్‌ 23 నుంచి జీ5 వేదికగా ఈసినిమా అందుబాటులో ఉందనుందని ఆయన చెప్పారు.

కథేంటంటే:

భాయిజాన్‌ (సల్మాన్‌ఖాన్‌) ఆత్మరక్షణలో యువకులకు శిక్షణ ఇస్తుంటాడు. అతడికి ముగ్గురు సోదరులు. మంచి అమ్మాయిని చూసి తమ అన్నకు పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి (పూజాహెగ్డే)ని తమ అన్నకు సరైన జోడీగా భావిస్తారు. అయితే, ఆమెకు రౌడీలంటే నచ్చదు. భాగ్యలక్ష్మి కోసం భాయిజాన్‌ కూడా మంచివాడిలా నటిస్తుంటాడు. పాత కక్షల కారణంగా భాగ్యలక్ష్మి కుటుంబానికి రౌడీ అన్న (జగపతిబాబు) నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. (Kisi Ka Bhai Kisi Ki Jaan Review) మరి రౌడీ అన్న నుంచి భాగ్యలక్ష్మి కుటుంబానికి తెలియకుండా భాయిజాన్‌ ఎలా కాపాడుతూ వచ్చాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి భాగ్యలక్ష్మిని భాయిజాన్‌ వివాహం చేసుకున్నాడా? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా తెరకెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని