Sapta Sagaralu Dhaati Side-B: ఓటీటీలోకి వచ్చేసిన ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రక్షిత్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్‌- బీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. 

Published : 26 Jan 2024 02:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘సప్త సాగరాలు దాటి సైడ్‌- బీ’ (Sapta Sagaralu Dhaati Side-B) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రచారం లేకుండా సైలెంట్‌గా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఆడియో అందుబాటులో ఉంది. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా డిసెంబరులోనే ఓటీటీలో రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty), రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. ‘సప్త సాగరాలు దాటి సైడ్‌- ఏ’కు సీక్వెల్‌గా రూపొందింది. ప్రియ పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులనూ కట్టిపడేసిన రుక్మిణీ వసంత్‌ టాలీవుడ్‌లో అవకాశం అందుకుందని సమాచారం. రవితేజ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ ఓ సినిమా తెరకెక్కించనున్నారని, అందులో హీరోయిన్‌గా రుక్మిణిని ఎంపిక చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో ప్రేమకథలు.. ఆ విషయంలో విసిగిపోయా: మృణాల్‌ ఠాకూర్

కథేంటంటే: మ‌ను (ర‌క్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) తమ ప్రేమ‌ని నిల‌బెట్టుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి, చివరకు విధి ముందు ఓడిపోతారు. ప్రియకు పెళ్ల‌వుతుంది. మ‌ను జైలులోనే జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంది. ఇదంతా తొలి భాగం (సప్త సాగరాలు దాటి - సైడ్‌ ఎ) క‌థ. ప‌దేళ్ల శిక్ష త‌ర్వాత 2021లో మ‌ను జైలు నుంచి తిరిగి రావ‌డంతో రెండో భాగం మొద‌ల‌వుతుంది. బ‌య‌టికి రాగానే ప్రియ చిరునామా తెలుసుకోవాల‌నుకుంటాడు మను. అందుకోసం సుర‌భి (చైత్ర జె.ఆచార్‌) సాయం తీసుకుంటాడు. మ‌రి, ప్రియ‌ని మ‌ను క‌లిశాడా? లేదా? ప‌దేళ్ల త‌ర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది? ఇంత‌కీ సుర‌భి ఎవ‌రు? త‌ను జైలులో మ‌గ్గిపోవ‌డానికి కార‌ణమైన వారిపై మ‌ను ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

సప్త సాగరాలు దాటి సైడ్‌- ఏ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

సప్త సాగరాలు దాటి సైడ్‌- బీ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని