Hanuman: ‘హను-మాన్’ టీజర్ అదుర్స్.. ప్రశాంత్ వర్మపై లెజండరీ దర్శకుడి ప్రశంసలు
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ‘హను-మాన్’ టీజర్‌పై ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మను (Prasanth Varma) లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) మెచ్చుకున్నారు. ‘హను-మాన్’ టీజర్ చూసిన ఆయన.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ‘‘హనుమాన్ టీజర్ చూశా. యానిమేషన్, విజువల్స్, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి. టీజర్ ఆరంభంలో భారీ ఆకారంలో హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా.. అనిపించేలా ఉంది. భక్తిభావం కలుగుతోంది. ప్రశాంత్‌వర్మకు హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో ఈసినిమా ఒక గొప్ప మార్క్ సృష్టించనుంది’’ అని ఆయన అన్నారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ సైతం చిత్రబృందం పనితనాన్ని మెచ్చుకున్నారు. విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయని అన్నారు.
‘జాంబి రెడ్డి’ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘హను-మాన్’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా సినీ ప్రియుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BRS: సమరానికి సై.. పార్లమెంట్లో భారాస వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు