Sound Party ott: ఓటీటీలో ‘సౌండ్‌ పార్టీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ కథానాయకుడిగా నటించిన ‘సౌండ్‌ పార్టీ’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 04 Mar 2024 15:58 IST

హైదరాబాద్‌: వి.జె.సన్నీ, హృతిక శ్రీనివాస్‌ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సౌండ్‌ పార్టీ’ (Sound Party ott). సంజయ్‌ శేరి దర్శకుడు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర నిర్మాతలు. నవంబరులో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో రాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో (Aha) మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆహా సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

ఇంతకీ కథేంటంటే: డాలర్ కుమార్ (వీజే సన్నీ) అతడి తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ)లది మధ్యతరగతి కుటుంబం. సులభంగా డబ్బు సంపాదించి, కోటీశ్వరులు కావాలని  కలలు కంటుంటారు. ఏ వ్యాపారం చేసినా అందులో నష్టమే. చివరకు కుబేర్ కుమార్‌కు పరిచయం ఉన్న నాగభూషణం(నాగిరెడ్డి) దగ్గర అప్పు తీసుకొని ‘గోరు ముద్ద’ అనే హోటల్ని ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా.. డాలర్ కుమార్ ప్రియురాలు సిరి (హృతిక శ్రీనివాస్) తండ్రి చెడగొడతాడు. దీంతో డాలర్ కుమార్ ఫ్యామిలీ మళ్లీ రోడ్డున పడుతుంది. మరోవైపు అప్పు ఇచ్చిన నాగ భూషణం డబ్బు కోసం ఒత్తిడి చేస్తాడు. అలాంటి సమయంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (పృథ్వీ) కొడుకు చేసిన నేరం మీద వేసుకొని జైలుకు వెళ్తే... రూ.2 కోట్లు ఇస్తామని చెబుతారు. డబ్బుకు ఆశపడి అసలు నేరం ఏంటో తెలియకుండా తండ్రీ కొడుకులు జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? ఉరిశిక్ష పడిన తండ్రీకొడుకులు దానినుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని