Allu Arjun: అల్లు అర్జున్‌.. యాక్టర్‌ Also.. డ్యాన్సర్‌ Also.. బన్ని డ్యాన్స్‌తో అదరగొట్టిన సాంగ్స్‌ ఇవే!

అల్లు అర్జున్‌ సినిమాల్లో విశేష ఆదరణ అందుకున్న కొన్ని పాటలివే..!

Updated : 25 Aug 2023 18:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్‌ బాగా చేసే ఈతరం హీరోల్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) టాప్‌లో ఉంటారు. దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్‌లో ఆయన అద్భుతంగా డ్యాన్స్‌లు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆయన సినిమా అంటే పంచ్‌ డైలాగ్‌లతో పాటు డ్యాన్స్‌లనూ ప్రేక్షకులకు కోరుకుంటారు. మాస్‌ బీట్స్‌కు ఆయన వేసే స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో కేవలం డ్యాన్స్‌లను మాత్రమే కాకుండా వేరే హీరోల స్టైల్స్‌ను ఇమిటేట్‌ చేసి మెప్పించారు. ‘రేసుగుర్రం’లోని ‘సినిమా చూపిస్త మావ’, ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’, ‘నా పేరు సూర్య’లోని ‘లవర్‌ ఆల్సో ఫైటర్‌ ఆల్సో’.. పాటల్లో ఆయన స్పిన్నర్‌, క్యాప్‌ వంటి వస్తువులను ఉపయోగించి వేసిన స్టెప్పులు యువత దృష్టిని బాగా ఆకర్షించాయి.

ఈ పాత్రలు చూస్తే.. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’

మరోవైపు జాతీయ అవార్డులు అందుకున్న తోటి నటీనటులు, చిత్ర బృందాలకు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు తెలిపారు.  ‘‘దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో జాతీయ అవార్డులు గెలుపొందిన వారందరికీ అభినందనలు. మీ విజయాలు గర్వకారణం. దేశనలుమూలల నుంచి నాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాపై ఎంతోమంది ప్రేమ చూపుతున్నారు. దీనిపై కృతజ్ఞతతో ఉన్నాను. ఈ అవార్డును ఎంతో గౌరవంగా, వినయంగా భావిస్తాను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రబృందంతో పాటు, నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry: The Nambi Effect) గురించి కూడా అల్లు అర్జున్‌ మరో ట్వీట్లో శుభాకాంక్షలు తెలిపారు. మరి బన్నీకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు స్పెషల్‌ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని