OMG 2: అక్షయ్‌ కుమార్‌ ‘ఓ మై గాడ్2’కు రివ్యూ ఇచ్చిన సద్గురు

అక్షయ్ కుమార్ (Akshay Kumar) కీలక పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్2’ (OMG 2) చిత్రం ప్రివ్యూను ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ (Sadhguru) చూశారు.

Published : 08 Aug 2023 14:53 IST

ముంబయి: అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘ఓ మై గాడ్2’ (OMG 2 Movie). అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆగస్టు11న ఈ చిత్రం విడుదలకానుంది. తాజాగా దీని స్పెషల్ ప్రివ్యూను ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ (Sadhguru) చూశారు. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు.

ఇషా యోగా సెంటర్‌కు వచ్చినందుకు అక్షయ్‌కు కృతజ్ఞతలు చెప్పిన సద్గురు..‘‘ఓ మై గాడ్2’ అద్భుతంగా ఉంది. స్త్రీలకు భద్రత, గౌరవమిచ్చే సమాజాన్ని మనం పెంపొందించుకోవాలి. దీనిపై యువతకు అవగాహన కల్పించడం చాలా అవసరం. మన విద్యావ్యవస్థ కూడా దీనిపై దృష్టి సారించాలి. యువతకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక దీనికి రిప్లై ఇచ్చిన అక్షయ కుమార్‌.. ‘‘మీ యోగా సెంటర్‌కు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ‘ఓమైగాడ్‌2’ చిత్రాన్ని చూసినందుకు ధన్యవాదాలు. సందేశాత్మక చిత్రాన్ని రూపొందించాలని మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించినందుకు మా టీమ్‌ అందరి తరపున కృతజ్ఞతలు’’ అని అన్నారు.

ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే!

అక్షయ్‌ కుమార్‌ శివుడిగా కనిపించనున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఈ సినిమాకు 27 మార్పులను సూచించింది. ముందు తీసిన సినిమా నుంచి సుమారు 13 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా తీసిన 14 నిమిషాలు యాడ్ చేశారు. 2012లో వచ్చిన ‘ఓ మైగాడ్‌’కు కొనసాగింపుగా ఈ సినిమాను రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని