Arjuna Phalguna: ఓటీటీలోకి శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజమర్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమం ద్వారా అలరించేందుకు సిద్ధమైంది.

Published : 14 Jan 2022 09:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు కథానాయకుడిగా తేజమర్ని తెరకెక్కించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ద్వారా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ ఇది. శ్రీవిష్ణు సరసన అమృతా అయ్యర్‌ నటించింది. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, రంగస్థలం మహేష్‌ తదితరులు దీనిలో కీలక పాత్రలు పోషించారు. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ సంగీతం అందించారు.

అర్జునుడి కథ ఇది..

గోదావ‌రి జిల్లాలోని ముల్కల్లంక అనే గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఆ ఊరిలో ఉండే ఐదుగురు స్నేహితులు అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావ‌ణి (అమృతా అయ్యర్‌), రాంబాబు (రాజ్‌కుమార్), త‌డ్డోడు (రంగ‌స్థలం మ‌హేష్‌), అస్కర్ (చైత‌న్య గ‌రికిపాటి) డిగ్రీ చ‌దివి ఖాళీగా తిరుగుతుంటారు. ఊర్లోనే ఉండి సంపాదించుకుంటేనే బెట‌ర్ అనే ఉద్దేశంతో ఓ సోడా కంపెనీ పెట్టాల‌నుకుంటారు. అందుకు దాదాపు రూ.4 ల‌క్షలు పెట్టుబ‌డి అవసరమని అంచనావేస్తారు. కానీ, అంత డ‌బ్బు వారి ద‌గ్గర ఉండ‌దు. మ‌రోవైపు త‌డ్డోడు కుటుంబాన్ని బ్యాంక్‌ అప్పుల‌ స‌మ‌స్య వేధిస్తుంటుంది. తీసుకున్న అప్పు వారం రోజుల్లో క‌ట్టకుంటే అత‌డి ఇల్లు జ‌ప్తు చేయాల్సి వ‌స్తుంద‌ని బ్యాంక్‌ అధికారులు హెచ్చరిక‌లు జారీ చేస్తారు. ఈ త‌రుణంలో త‌మ ఆర్థిక‌ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి అర్జున్ త‌న మిత్రుల‌తో క‌లిసి ఓ ప్రణాళిక ర‌చిస్తాడు. సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లింగ్ చేయ‌డానికి సిద్ధప‌డ‌తాడు. ఈ క్రమంలో అర్జున్ మిత్ర బృంద‌మంతా అనుకోని స‌మ‌స్యల్లో చిక్కుకుంటుంది. దీంతో ఒక్కసారిగా వాళ్ల జీవితాలు త‌ల‌కిందుల‌వుతాయి. ఓవైపు పోలీసులు వారిని ప‌ట్టుకునేందుకు ప్రయ‌త్నిస్తుంటే.. మ‌రోవైపు ఓ రౌడీ గ్యాంగ్ వెతుకుతుంటుంది. రౌడీలకు అర్జున్ బృందానికి మ‌ధ్య ఏం జ‌రిగింది? ఈ స‌మస్యల నుంచి వాళ్లెలా బ‌య‌ట‌ప‌డ్డారు? త‌డ్డోడు బ్యాంకు అప్పుతో ఊరి క‌ర‌ణం (న‌రేష్‌)కు ఉన్న లింకేంటి? అర్జున్- శ్రావ‌ణి ప్రేమ‌ ఏమైంది? అన్నది మిగతా కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని