Ustaad: ఓటీటీలోకి ‘ఉస్తాద్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

శ్రీ సింహా కోడూరి (sri simha koduri ), కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉస్తాద్‌’ (ustaad). ఇప్పుడీ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

Published : 01 Sep 2023 15:54 IST

హైదరాబాద్‌: శ్రీ సింహా కోడూరి  (sri simha koduri) నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌’ (Ustaad). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఫణిదీప్‌ దర్శకత్వం వహించిన ఇందులో కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు OTTలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. అకీవా.బి సంగీతం అందించిన ఈ చిత్రంలో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, అను హాస‌న్‌, ర‌వీంద్ర విజ‌య్‌, తదితరులు నటించారు. 

 ‘జైలర్‌’ హవా.. రజనీకాంత్‌కు డబుల్‌ సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

క‌థేంటంటే: మ‌న‌సుకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్లే కుర్రాడు సూర్య‌ (శ్రీసింహా). చిన్న‌ప్పుడే తండ్రి మ‌ర‌ణించ‌డంతో.. త‌ల్లే (అను హాస‌న్‌) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తుంది. సూర్య‌కు ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌యం. అలాగే విప‌రీత‌మైన కోపం. ఏ భావోద్వేగాన్నైనా అప్ప‌టిక‌ప్పుడే చూపించేయ‌డం త‌న నైజం. జీవితంపై ఏ స్ప‌ష్టతా ఉండ‌దు. డిగ్రీ చ‌దివే రోజుల్లో ఓ పాత కాలం నాటి బైక్‌ను ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కుంటాడు. దానికి ఉస్తాద్ అని పేరు పెట్టుకుంటాడు. అది జీవితంలోకి వ‌చ్చాక త‌న ఆనందం.. బాధ‌.. క‌ష్టం.. సుఖం.. ప్ర‌తిదీ దానితోనే పంచుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆ బైక్ వ‌ల్లే మేఘ‌న (కావ్యా క‌ల్యాణ్ రామ్‌) సూర్య జీవితంలోకి వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఆ త‌ర్వాత సూర్య‌కు పైల‌ట్ అవ్వాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌డుతుంది.  మ‌రి ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌య‌ప‌డే సూర్య పైల‌ట్ అవ్వాల‌న్న త‌న క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాడు? ఈ క్ర‌మంలో త‌న‌కెదురైన స‌వాళ్లేంటి? (ustaad movie on OTT) త‌న వ్య‌క్తిత్వం వ‌ల్ల ప్రేమ‌క‌థ‌లో వ‌చ్చిన చిక్కులేంటి?  వీట‌న్నింటినీ సూర్య ఎలా ప‌రిష్క‌రించుకున్నాడు? ఈ ప్ర‌యాణంలో ఉస్తాద్ అత‌ని జీవితాన్ని ఎలా ప్ర‌భావితం చేసింది? ఈ క‌థ‌లో బైక్ మెకానిక్ బ్ర‌హ్మం (ర‌వీంద్ర విజ‌య్‌), పైల‌ట్‌ జోసెఫ్ డిసౌజా (గౌత‌మ్ మేన‌న్‌) పాత్ర‌ల‌కున్న ప్రాధాన్య‌త ఏంట‌న్న‌ది అమెజాన్‌లో చూసి తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని