బాలీవుడ్‌లో గ్రాండ్‌ పార్టీ.. ఒకేచోట కలిసిన స్టార్‌ హీరోలు..!

బాలీవుడ్‌లో తాజాగా గ్రాండ్‌ పార్టీ జరిగింది. సీనియర్లు, యువ హీరోలు సందడి చేశారు.

Updated : 03 Sep 2023 11:14 IST

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్లు, యువ నటులు ఒకే చోట కలిశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. వీకెండ్‌ను సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరెవరు హాజరయ్యారంటే..?

Maanas: బిగ్‌బాస్‌ ఫేమ్‌ మానస్‌ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ నటుడు సన్నీ దేఓల్‌ (Sunny Deol) నటించిన చిత్రం ‘గదర్‌ 2’ (Gadar 2). అనిల్‌ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు ఆరంభంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. చాలా ఏళ్ల తర్వాత సన్నీ దేఓల్‌ ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ విజయాన్ని తన తోటి నటీనటులతో పంచుకోవాలని సన్నీ భావించారు. ఈ మేరకు బీటౌన్‌ స్టార్స్‌ కోసం శనివారం రాత్రి ముంబయిలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, కాజోల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, సారా అలీఖాన్‌, కృతిసనన్‌, జాకీష్రాఫ్‌, గౌరీ ఖాన్‌, తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. సన్నీ విజయం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత షారుఖ్‌ - సన్నీదేఓల్‌ కలిసి కనిపించారు. ‘డర్‌’ సినిమా తర్వాత వీరి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి వీరిద్దరూ కలిసి కనిపించలేదు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని