Sini Shetty: ఇప్పటి మిస్‌ ఇండియా ఒకప్పటి ఎయిర్‌టెల్‌ భామనే

మిస్‌ ఇండియా టైటిల్‌ విజేత సినీశెట్టిపై ఆసక్తికర విశేషాలు

Updated : 04 Jul 2022 14:19 IST

మొత్తం 109 పోస్టులు.. ఆ వీడియోలే ఎక్కువ

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీశెట్టి (SiniShetty).. ఇంతకు ముందు వరకూ పెద్దగా పరిచయం లేని పేరు. తాజాగా జరిగిన మిస్‌ ఇండియా(Miss India) పోటీల్లో కిరీటాన్ని గెలుచుకోవడంతో ఈ భామ పేరు ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో (Fashion World) మార్మోగిపోతోంది. దీంతో ఈ 21 ఏళ్ల అందాల భామ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె సోషల్‌మీడియా ఖాతాలను తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీశెట్టి సోషల్‌మీడియా వాల్‌పై ఓ లుక్కేద్దాం.

ముంబయిలో నివాసముంటోన్న ఓ కన్నడ కుటుంబంలో 2001లో సినీశెట్టి జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 21 ఏళ్లు. అకౌంటెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం సీఎఫ్‌ఏ కోర్సు చేస్తున్నారు.

సినీకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. మోడల్‌గా ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోకి అడుగుపెట్టి.. ఎంతోమంది అందగత్తెలను దాటుకుని విజేతగా గెలుపొందారు.

డ్యాన్స్‌ అంటే చిన్నతనం నుంచే ఆమెకు ఆసక్తి. దీంతో నాలుగేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. 14 ఏళ్ల వయసులో నృత్యకారిణిగా అరంగేట్రం చేశారు. ఎక్కడైనా సూపర్‌ బీట్‌ వినపడితే ఆమె కాలు కదపకుండా ఉండలేరు.

చాలా అరదుగా సోషల్‌మీడియా ఖాతాలను ఆమె వాడుతుంటారు. ఇప్పటివరకూ ఆమె పేరుతో కేవలం ఇన్‌స్టాలోనే అకౌంట్‌ ఉంది. అదీ అధికారిక పేజీ కాదు. ఇక, ఫేస్‌బుక్‌, ట్విటర్లలో ఎలాంటి ఖాతాల్లేవు.

2017లో సినీశెట్టి ఇన్‌స్టా కుటుంబంలోకి అడుగుపెట్టారు. ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోని తొలిసారి షేర్‌చేశారు. ప్రకృతి అంటే తనకెంతో ఇష్టమని ఆమె పలు పోస్టులలో తెలిపారు.

ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య 77.6వేలు. 1646 మందిని ఆమె ఫాలో అవుతున్నారు. ఇప్పటివరకూ ఆమె 109 పోస్టులు పెట్టగా.. వాటిల్లో ఎక్కువశాతం తన డ్యాన్స్‌ వీడియోలే.

‘‘జీవితంలో ఏదీ అంత సులభంగా రాదు. ప్రతిదాని వెనుక కనిపించని కష్టం ఉంటుంది’’ అనే మాటను ఆమె ఎక్కువగా నమ్ముతుంటారు. తాను సాధించాలనుకున్న దాని కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటానని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

ఈ మిస్‌ ఇండియా ఒకప్పటి ఎయిర్‌టెల్‌ భామనే. ప్రముఖ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ఎయిర్‌టెల్‌ కోసం గతంలో రూపొందించిన వాణిజ్య ప్రకటనలో ఆమె కెమెరా ముందుకు వచ్చారు. కెమెరా ముందు తన ప్రయాణం ఎంతో సరదాగా సాగిందని తెలిపారు.

తన తల్లే తనకి స్ఫూర్తి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆమె నుంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. తన తల్లి అందంలో కొంత కూడా తనకి రాలేదని సినీ సరదాగా అంటుంటారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని