Rashmika-Vijay Devarakonda: మరోసారి తెరపైకి రష్మిక-విజయ్‌ రిలేషన్‌షిప్‌..?

ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా యువ హృదయాలు గెలుచుకున్నారు నటి రష్మిక, నటుడు విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’లో రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ...

Published : 04 Jan 2022 10:01 IST

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: ఆన్‌స్క్రీన్‌ లవ్లీ పెయిర్‌గా యువ హృదయాలు గెలుచుకున్నారు నటి రష్మిక, నటుడు విజయ్‌ దేవరకొండ. ‘గీత గోవిందం’లో రష్మిక-విజయ్‌ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రోహిత్‌ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. విజయ్‌తో ప్రేమలో ఉండటంతోనే ఆమె రోహిత్‌కు బ్రేకప్‌ చెప్పారని పలువురు అనుకున్నారు కూడా. అలాంటిదేమీ లేదని రష్మిక-విజయ్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ తాజాగా వీళ్ల మధ్య ఉన్న రిలేషన్‌ మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇటీవల దేవరకొండ సోదరులు గోవాకు వెళ్లారు. న్యూ ఇయర్‌ విషెస్‌ తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా పలు ఫొటోలు షేర్‌ చేశారు. అదే సమయంలో రష్మిక సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘హ్యాపీ న్యూ ఇయర్‌ మై లవ్స్‌’ అని హార్ట్‌ ఎమోజీతో ఓ ఫొటో షేర్‌ చేశారు. రష్మిక షేర్‌ చేసిన పిక్‌లో ఉన్న లొకేషన్‌.. ఆనంద్‌ షేర్‌ చేసిన ఫొటోలోనిది ఒకటే కావడంతో అందరూ విజయ్‌-రష్మిక డేటింగ్‌లో ఉన్నారంటూ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, షూటింగ్స్‌ నిమిత్తం గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉన్న ఈ జంట క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇటీవల డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి వీళ్లిద్దరూ బయటకు వస్తోన్న ఫొటోలు  నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని