Pawankalyan: భీమ్లానాయక్‌ పాట.. మొగులయ్యకు పవన్‌ ఆర్థిక సాయం

‘భీమ్లానాయక్‌’ పాటలోని సాకీ ఆలపించిన కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధ్యక్షుడు, కథానాయకుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రూ.2 లక్షలు...

Updated : 27 Feb 2024 13:57 IST

హైదరాబాద్‌: ‘భీమ్లానాయక్‌’ పాటలోని సాకీ ఆలపించిన కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధ్యక్షుడు, కథానాయకుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రూ.2 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. తెలంగాణలోని అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడని పవన్‌ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళాకారులను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్‌కు ఉందని.. ఇందులో భాగంగా ‘పవన్‌కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్ ఎక్సిలెన్స్‌’ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళీ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో పవన్‌ భీమ్లానాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. పవన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2న ‘భీమ్లానాయక్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో దూసుకెళ్తోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని